జాన్వీ కపూర్ ఈ సినిమాలో ‘అచ్చియమ్మ’ అనే గ్రామీణ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఆమె లుక్, బాడీ లాంగ్వేజ్, నటన అన్నీ పూర్తిగా కొత్తగా, ప్రత్యేకంగా ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ‘చికిరీ’ పాటలో జాన్వీ కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఆమె పాత్ర సినిమాకు కీలకమైన భావోద్వేగాన్ని అందించనుందని సమాచారం.అయితే, తాజాగా సినిమా సర్కిళ్లలో ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. జాన్వీ కపూర్ కొన్ని యాక్షన్ లేదా ప్రత్యేక సీన్లలో డూప్‌గా మరో హీరోయిన్ నటించిందని ప్రచారం జరుగుతోంది. ఆ డూప్ మరెవరో కాదు — ‘మసూద’ సినిమాలో దెయ్యం పాత్రతో ప్రేక్షకులను భయపెట్టిన బాంధవి శ్రీధర్.
చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న సమాచార ప్రకారం, జాన్వీ కపూర్ హైట్ సుమారు 5 అడుగులు 4 అంగుళాలు కాగా, బాంధవి శ్రీధర్ హైట్ కూడా దాదాపు అదే రేంజ్‌లో ఉండటంతో ఫిజికల్ అపియరెన్స్ పరంగా ఇద్దరూ చాలా వరకు ఒకేలా కనిపిస్తారని చెబుతున్నారు. దీంతో కొంతమంది క్లిష్టమైన సీన్లలో లేదా వైడ్ షాట్లలో బాంధవిని డూప్‌గా ఉపయోగించారని సమాచారం. ఇంతేకాదు, బాంధవి శ్రీధర్ కేవలం డూప్‌గా మాత్రమే కాదు, ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కూడా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర కథలో ఏమేరకు ప్రాముఖ్యత కలిగి ఉందో, జాన్వీ పాత్రతో ఎలా కనెక్ట్ అవుతుందో సినిమా రిలీజ్ అయ్యే వరకు తెలియదు. ఈ వార్తల నిజానిజాలు ఏంటి, బాంధవి పాత్ర ఎంత పెద్దది, జాన్వీతో కలిసి ఆమె ఏ విధమైన సీన్లలో నటించింది—ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానున్న ‘పెద్ది’ సినిమా వరకు మనం కాస్త వేచి చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి