ఈ చర్చల మధ్యలో అల్లు అర్జున్ తీసుకున్న కొత్త నిర్ణయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. పైరసీ కేసు, ప్రేక్షకుల కోపం, రెమ్యూనరేషన్ పై వచ్చిన విమర్శలు… ఇవన్నీ కలిపి పెద్ద గోల సృష్టిస్తున్న వేళ, అల్లు అర్జున్ తన పారితోషికాన్ని గణనీయంగా తగ్గించుకున్నాడనే వార్త బయటకు వచ్చింది. ఇక ఇది వెనుక అసలు కారణమేంటన్నది మాత్రం క్లారిటీగా తెలియకపోయినా, సోషల్ మీడియాలో రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఒక వర్గం మాట ప్రకారం — “మా వల్లే ఇండస్ట్రీ బడ్జెట్ పెరుగుతుందని, దాని భారమంతా ప్రేక్షకుల మీద పడుతున్నదని అల్లు అర్జున్ గ్రహించి, తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడు” అంటుంటారు.మరికొంత మంది — “ఇది పూర్తిగా స్ట్రాటజీ… కొత్త సినిమా స్కేల్, మార్కెట్ లెక్కలు ఇలా చాలా కారణాల వల్ల తీసుకున్న ఆర్థిక నిర్ణయం కావచ్చు” అంటున్నారు.
గతంలో ‘పుష్ప’ కోసం ఆయన దాదాపు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమా కోసం కేవలం 100 కోట్ల వరకే పారితోషికాన్ని తీసుకుంటున్నాడట. మిగతా మొత్తం సినిమా మేకింగ్ మీద ఖర్చు పెట్టాలని స్వయంగా చెప్పాడని కొన్ని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.అల్లు అర్జున్ నిజంగానే ఇలా చేస్తే, ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరికీ ఒక రకంగా ఆదర్శంగా నిలిచినట్టే. “హీరోలు తమ రెమ్యూనరేషన్స్ తగ్గిస్తే, టికెట్ రేట్లు కూడా కొంతవరకు తగ్గొచ్చు… ఆప్పుడు మేము మళ్లీ థియేటర్లకు వెళ్తాం” అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా… ఈ పరిణామం మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో భగ్గుమంటోంది. ఒక వైపు పైరసీ, మరోవైపు స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్… ఇండస్ట్రీలో కొత్త చర్చలకు శ్రీకారం చుడుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి