నందమూరి బాలకృష్ణ ,బోయపాటి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం అఖండ 2. మాస్ చిత్రాలకు కేరాఫ్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన మూడు చిత్రాలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో అభిమానులు కూడా అఖండ 2 సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.



ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో ఉపయోగించిన ఒక శక్తివంతమైన వాహనాన్ని చిత్ర బృందం ఇటీవలె విడుదల చేశారు. అఖండ 2 సినిమా కోసమే ప్రత్యేకించి ఈ వాహనాన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో జరిగిన ఒక ఈవెంట్లో డైరెక్టర్ బోయపాటి శ్రీను పాల్గొంటూ ఈ కారుని లాంచ్ చేశారు. ఈ విషయం పైన బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అఖండ 2 చిత్రంలో ఒక శక్తివంతమైన పాత్ర కోసం ఈ వాహనాన్ని డిజైన్ చేయించామంటూ తెలిపారు.


ఈ వాహనాన్ని వెండితెర పైన చూసిన ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోతారని, ఈ వాహనాన్ని ఇంతగా డిజైన్ చేసిన అమర్ కి నా కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు బోయపాటి శ్రీను. సుమారుగా నాలుగు రోజుల పాటు కష్టపడి ఈ డిజైన్ ని చేశారని, అఖండ 2 సినిమా అంటే కేవలం అది సినిమా మాత్రమే కాదు, భారతదేశపు ఆత్మ ఈ సినిమా పైన నేను ఇంతలా ఎందుకు చెబుతున్నానో అనే విషయంపై రేపు సినిమా చూశాక మీకే అర్థమవుతుందంటూ తెలియజేశారు బోయపాటి శ్రీను. ఇందులో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, పూర్ణ, విజయ్ చంద్ర శేఖర్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: