వాస్తవానికి ఈ పాటను ఎలాంటి సెట్స్‌లో గానీ, గ్రీన్ స్క్రీన్ ముందు గానీ చిత్రీకరించలేదు. టీమ్ మొత్తం ఒక నిజమైన కొండ ప్రాంతానికి వెళ్లి షూట్ చేశారు. అందుకోసం యూనిట్ సభ్యులు దాదాపు 45 నిమిషాలకు పైగా కఠినమైన ట్రెక్కింగ్ చేసి, కొండ శిఖరాన్ని చేరుకున్నారు. మేకింగ్ వీడియోలో రామ్ చరణ్ కూడా ట్రెక్కింగ్ సమయంలో బాగా అలసిపోయి ఆగుతూ, మళ్లీ ఎక్కుతూ వెళ్లిన షాట్స్ చూపించారు. ఇది ప్రేక్షకులకు అద్భుతంగా అనిపించింది.వీడియో చివర్లో దర్శకుడు బుచ్చిబాబు సనా, రామ్ చరణ్ ఇద్దరూ చిరుత గురించి మాట్లాడుకున్నారు. ఆ సంభాషణ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
ఇప్పుడు అసలు విషయానికి వస్తే—‘చికిరి చికిరి’ పాటను మహారాష్ట్రలోని పుణే ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ సవల్య ఘాట్ వద్ద షూట్ చేశారు. ఈ ప్రదేశం ఎత్తైన కొండలు, చుట్టూ కనిపించే పచ్చని ప్రకృతి, మేఘాల నడుమ కనిపించే అద్భుత దృశ్యాలతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా పాటలో కనిపించిన కొండపైభాగానికి ఎలాంటి వాహనాలు వెళ్లే అవకాశం లేదు. అక్కడికి చేరాలంటే తప్పనిసరిగా ట్రెక్కింగ్ చేయాల్సిందే. అందుకే యూనిట్ సభ్యులే కాకుండా రామ్ చరణ్ కూడా పూర్తి ట్రెక్కింగ్ చేసి అక్కడికి చేరి పాట లో డ్యాన్స్ చేశారు.అత్యంత కష్టపడి, సహజ అందాలను ఒడిసిపట్టుకుని తీశారు కాబట్టి చికిరి పాట విజువల్స్ అంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పాటకు వచ్చిన ప్రేమ, మేకింగ్ వీడియోకు వచ్చిన స్పందన చూస్తుంటే, సినిమా మీద హైప్ ఎంత పెరిగిందో అర్థమవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి