టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. నయన తార ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బీమ్స్ సిసిరిలీయో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనునట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను , ఒక పాటను విడుదల చేశారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల.నుండి లభించింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన మీసాల పిల్ల సాంగ్ కి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నైజాం ఏరియా థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు అయినటువంటి దిల్ రాజు ఈ సినిమా యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను దాదాపు 32 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా 32 కోట్లకు మించి షేర్ కలెక్షన్లను నైజాం ఏరియాలో వసూలు చేస్తేనే నైజాం ఏరియాలో హిట్ స్టేటస్ను అందుకుంటుంది. ఈ మూవీ ఈజీగా నైజాం ఏరియాలో 32 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తుంది అని మెగా అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: