అఖండ 2 ప్రమోషన్ల కోసం విశాఖకు వెళ్లిన బాలయ్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ఒక అభిమానిపై బాలయ్య కొంచెం కోపంగా స్పందించిన వీడియో బయటకు రావడంతో నెటిజెన్స్ మధ్య పెద్ద సంచలనం రేగింది. "బాలయ్య ఎందుకు అంత సీరియస్ అయ్యారు?", "ఆయన ఎందుకు అలా అరవాల్సివచ్చింది?" అంటూ చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ వీడియో మరింత విస్తృతంగా షేర్ అవుతుండటంతో, చివరకు అఖండ 2 చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట స్వయంగా ముందుకు వచ్చి ఈ ఘటనపై పూర్తి వివరణ ఇచ్చారు.
ఒక తాజా ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ… “బాలయ్య కోపంగా స్పందించడానికి కారణం కూడా లేకపోలేదు. ఆ విషయంలో ఆయనను తప్పుపట్టే పరిస్థితి అసలు లేదు. అంతకు ముందుగా అక్కడ కొన్ని అనుచితమైన పరిస్థితులు జరిగాయి. కొన్ని సెక్యూరిటీ సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఆ టెన్షన్ కారణంగానే బాలయ్య ఆ అభిమానితో కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. కానీ అది ఎవరి మీద కోపం కాదు. పరిస్థితి తీవ్రతను చూసి, అందరి భద్రత కోసం ఆయన తక్షణ నిర్ణయం తీసుకున్నారు” అని వివరించారు.
అంతేకాకుండా… “బాలయ్యను అభిమానులకు దూరం పెట్టే వ్యక్తే కాదు. ఆయనకు అభిమానులంటే ఎంతో ప్రేమ, గౌరవం. ఆ రోజు కూడా అభిమానులను బాధపెట్టాలనే ఉద్దేశ్యమే లేదు. కేవలం అక్కడి పరిస్థితులు ఆయనను అలా మాట్లాడేలా చేశాయి. వీడియోలో కనిపించినదానికన్నా అసలు నిజం పూర్తిగా వేరే. కావాలనే దానిని తప్పుగా అర్థం చేసుకోవద్దు” అని స్పష్టం చేశారు. దీని పై బాలయ్య ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. బాలయ్య తప్పు చేయనిదే అరవడు. ఇక ఆయనని విమర్శించేవాళ్ళు ఆపండి అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి