కొంత కాలం క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ "జైలర్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. రమ్య కృష్ణ ఈ సినిమాలో రజనీ కాంత్ కు భార్య పాత్రలో నటించగా ... తమన్నా , సునీల్ ఈ మొవు్ లో ముఖ్య పాత్రలలో ప్రకటించారు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ , సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా జైలర్ 2 అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో చాలా మంది క్రేజీ హీరోలు కనిపించనున్నట్లు , అందులో భాగంగా ఓ కీలకమైన పాత్రలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ కూడా నటించబోతున్నట్లు మొదట వార్తలు వచ్చాయి.

కొంత కాలం క్రితం నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాలోని ఒక పాత్రకు సంబంధించిన కథ ను బాలయ్య కు వినిపించగా అది పెద్దగా నచ్చకపోవడంతో బాలయ్య ఈ సినిమాలో నటించడం లేదు అనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విజయ్ సేతుపతి నటించనున్నట్లు , ఈయన పాత్ర నిడివి ఈ సినిమాలో కాస్త తక్కువ ఉండనున్నట్లు కానీ ఈ సినిమా కథ మొత్తాన్ని టర్న్ చేసే పాత్రలో విజయ్ సేతుపతి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. జైలర్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో జైలర్ 2 సినిమాపై ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: