మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా సంవత్సరాల క్రితం సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం ఆరెంజ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. జెనీలియా ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నాగబాబు ఈ సినిమాను నిర్మించాడు. హరిజ్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి కూడా ఈ మూవీ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా 2016 వ సంవత్సరం నవంబర్ 26 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయ్యి తాజాగా 15 సంవత్సరాల కంప్లీట్ అయింది. మరి ఈ సినిమా విడుదల అయ్యి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు ఫ్లాప్ గా అయ్యింది అనే విషయాల గురించి తెలుసుకుందాం.

 ఆరెంజ్ మూవీ కంటే ముందు రామ్ చరణ్ మగధీర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా తెలిసింది. మగధీర లాంటి భారీ విజయం తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ కూడా బొమ్మరిల్లు , పరుగు లాంటి రెండు విజయవంతమైన సినిమాలు తర్వాత ఆరెంజ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. దానితో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ మూవీ సాంగ్స్ ఈ సినిమా విడుదలకు ముందు అద్భుతమైన రేంజ్ లో పాపులర్ అయ్యాయి. దానితో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆ స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ మూవీ కి ఫ్లాప్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేక ఫ్లాప్ గా మిగిలిపోయింది. కొంత కాలం క్రితం ఈ సినిమాను రీ రిలీజ్ చేయగా రీ రిలీజ్ లో మాత్రం ఈ మూవీ మంచి కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: