ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్ లో ఉందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు రాగా.. ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ దగ్గర ఉన్న లింగ బైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో రాజ్ నిడిమోరు తో ఏడడుగులు వేసింది సమంత. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ఇక సమంత తన పెళ్లి ఫోటోలను అలా షేర్ చేసిందో లేదో ఇలా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. కేవలం 16 గంటల్లోనే 79 లక్షలకు పైగా లైక్స్, కొన్ని లక్షల కామెంట్లు రావడం గమనార్హం.
అలా రెండో పెళ్లితో మరోసారి ఇంస్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది సమంత. ఇకపోతే సమంత ఎట్టకేలకు రాజ్ తో ఏడు అడుగులు వేయడంతో పలువురు సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంత కెరియర్ విషయానికి వస్తే ఒకవైపు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. శుభం అనే సినిమాను నిర్మించింది. ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాదు ఆ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది సమంత. అలాగే హిందీలో రాజ్ దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి