ఇదే క్రమంలో తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మరో కొత్త పెళ్లి ఫోటోను పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటో ప్రత్యేకత ఏంటంటే—అందులో సమంత ఇచ్చిన ఫన్నీ క్యాప్షన్. ఆ క్యాప్షన్ చూస్తుంటే నెటిజన్లలో కొత్త రకాల అనుమానాలు, ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఫోటోలో సమంత తన చేతిలో పూలదండ పట్టుకొని, ఆ పూలదండను రాజ్ నిడిమోరుకి వేసేందుకు సిద్ధంగా నిలబడి ఉంది. ఆమె ముఖంపై కనిపించే అందమైన చిరునవ్వు, పూలదండ పట్టుకున్న తీరు, రాజ్ వైపు తధేకంగా చూస్తున్న ఎక్స్ ప్రెషన్స్—అన్నీ కలిపి ఆ క్షణాన్ని మరింత అందంగా మార్చేశాయి. పెళ్లి వేడుకలో సాంప్రదాయానుసారంగా వచ్చే ఆ క్షణాన్ని సమంత ఎంతో క్యూట్‌గా, ఫన్నీగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే ఈ ఫోటోకే ఆమె ఇచ్చిన క్యాప్షన్ మాత్రం అంత కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. ఆ క్యాప్షన్‌లో సమంత ..“నువ్వు అతని సమస్య అని ఇప్పటినుండి గ్రహించే క్షణం.” దీనితో పాటు ఒక డెవిల్ ఎమోజీ కూడా జత చేసింది.
ఈ ఒక్క క్యాప్షన్‌తోనే సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. సమంత ఇచ్చిన ఈ ఫన్నీ హింట్‌ను చూసి నెటిజన్లు వందరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది పెళ్లి తర్వాత భార్యభర్తల మధ్య జరిగే ఆ చిన్న చిన్న ఫన్నీ వర్నింగ్స్‌లో భాగమని చెబుతుండగా, మరికొందరు సమంత ఇలా డెవిల్ ఎమోజీ ఎందుకు పెట్టింది? ఎందుకు ‘సమస్య’ అనే పదాన్ని ఉపయోగించింది? అని ఆశ్చర్యపోతున్నారు. తదేకంగా చూస్తే ఇది పూర్తిగా ఫన్నీ టోన్‌లో రాసిన జోక్ అయినప్పటికీ, “ఇక్కడి నుంచి నీ టైం స్టార్ట్ అయింది రాజ్” అన్నట్టుగా సమంత సరదాగా ఇచ్చిన ఒక చిన్న హెచ్చరికలా ఉందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు అయితే “అసలు సమస్య ఇప్పుడే మొదలైంది అన్నట్టుగా సమంత ఫన్నీగా చెప్పిందా?” అంటూ హాస్యంగా స్పందిస్తున్నారు.
మొత్తానికైతే, సమంత కొత్తగా పోస్ట్ చేసిన ఈ ఒక్క ఫోటో, దానికి ఇచ్చిన ఫన్నీ క్యాప్షన్, ఆమె పెట్టిన డెవిల్ ఎమోజీ—అన్నీ సోషల్ మీడియాలో మరోసారి భారీ సంచలనం సృష్టించాయి. అభిమానులు, ఫాలోవర్లు, నెటిజన్లు అందరూ ఈ పోస్ట్‌పై చురుకుగా స్పందిస్తుండటంతో, సమంత—రాజ్ నిడిమోరు జంట మరోమారు హాట్ టాపిక్‌గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి