ప్రదీప్ రంగనాథన్, కీర్తీశ్వరన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'డ్యూడ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధించింది. ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి, సక్సెస్‌ఫుల్ మూవీగా నిలిచింది. ఈ నేపథ్యంలో, సినీ విశ్లేషకులు, రచయిత అయిన పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా కథాంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పరుచూరి మాట్లాడుతూ, 'డ్యూడ్' కథలో అనేక కోణాలు, పార్శ్వాలు ఉన్నాయని అన్నారు. దర్శకుడు కీర్తీశ్వరన్ చాలా తెలివిగా సినిమాను ఒక విఫలమైన ప్రేమకథతో ప్రారంభించినా, మొదటి సన్నివేశంలోనే కామెడీ టచ్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారని ఆయన ప్రశంసించారు. కథానాయిక గర్భవతి అయినప్పుడు, ఆ ప్రెగ్నెన్సీని తీయించుకోవద్దని హీరో చెప్పడం అతనికి మంచి మార్కులను తెచ్చిపెట్టిందని పరుచూరి పేర్కొన్నారు.
అంతేకాకుండా, సినిమాలో ఉన్న మరో ముఖ్యమైన ట్విస్ట్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కథానాయిక తండ్రిని ఎవరు కాపాడారనే అంశం సినిమాలో కీలక మలుపు అని ఆయన వివరించారు. అయితే, కథానాయిక గర్భవతి అయినప్పుడు వెంటనే హీరోతో పెళ్లి చేయడం అనేది సరైన నిర్ణయం కాదని పరుచూరి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తం మీద, 'డ్యూడ్' సినిమా తనకు బాగా నచ్చిందని, ప్రదీప్ రంగనాథన్ నటన అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు. ఈ చిత్రం విజయం సాధించడంపై ప్రదీప్ రంగనాథన్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. డ్యూడ్ సినిమా ఓటీటీలో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం. ప్రదీప్ రంగనాథన్ ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి