గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘అఖండ’ విజయం తర్వాత, దాని సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2 - తాండవం’ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. దర్శకుడు బోయపాటి శ్రీను - బాలయ్య కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో సహజంగానే ఒక ప్రత్యేక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఈ కాంబినేషన్‌ నుంచి వచ్చే ప్రతీ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ ఫెయిల్ ఉంటుంది. అందుకే ఈ సీక్వెల్ మొదటి పోస్టర్ వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అన్నీ కలిసి సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. బాలయ్య అఘోర పాత్రలో చూపించిన పవర్‌ఫుల్ లుక్, వినాయక చవితి సందర్భంగా వచ్చిన ట్రైలర్‌లోని ప‌వ‌ర్ ఫుల్‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైలాగ్ డెలివరీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ముఖ్యంగా “ధర్మం శక్తి, శక్తే ధర్మం” వంటి డైలాగ్‌లు అభిమానుల్లో మాస్ పుల్ పెంచాయి. ఈ సినిమా అసలుగా గత వారం విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. అయితే టీమ్ వెంటనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించడంతో అభిమానుల్లో మళ్లీ క్రేజ్ రెట్టింపు అయింది. తాజా సమాచారం ప్రకారం, సినిమా డిసెంబర్ 11న పెయిడ్ ప్రీమియర్స్, డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కానుంది. భారీ స్క్రీన్ కౌంట్‌తో ఈ సినిమాను విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే వచ్చిన స్పందన ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచేలా ఉంది. కేవలం ఒక గంటలోనే 18.5K టికెట్లు బుక్ కావడం, ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను తొలిరోజు చూడాలని భారీగా బుకింగ్స్ చేస్తున్నారు.


మరియు పెయిడ్ ప్రీమియర్స్‌కు టికెట్లు ఓపెన్ చేసిన వెంటనే మరింత డిమాండ్ ఉండే అవకాశం ఉందని ట్రేడ్‌ అనలిస్టులు భావిస్తున్నారు. బాలయ్యబోయపాటి కాంబోకు ఉన్న అపారమైన క్రేజ్, అఖండ మొదటి భాగం చేసిన కలెక్షన్స్ సీక్వెల్‌కు భారీ మార్కెట్‌ను పెంచాయి. ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం ప్రకారం, ‘అఖండ 2: తాండవం’ ఈ సంవత్సరం చివర్లో బాక్సాఫీస్‌ను హై వోల్టేజ్‌గా షేక్ చేయడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ రాబోతున్నాయన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి, 2024 చివరి రోజుల్ని బాలయ్య మాస్ తాండవంతో ముగించబోతున్నారన్న సంకేతాలు ఈ సినిమా పంపేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: