గతంలో ఆయన చెప్పిన ప్రసిద్ధ డైలాగ్ “కొన్ని సార్లు రావడం లేటు కావచ్చు… కానీ రావడం అయితే పక్కా” ఇప్పుడు అఖండ 2 విడుదల సందర్భంలో మరోమారు ట్రెండ్ అవుతోంది. ఈ డైలాగ్‌ను బాలయ్య అభిమానులు తమ స్టైల్లో రీక్రియేట్ చేస్తూ, “అఖండ 2 ఎప్పుడు వచ్చిన వెంటనే బ్లాక్‌బస్టర్ ఖాయం!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఒరిజినల్ అఖండ సినిమా హై వోల్టేజ్ యాక్షన్, బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘అఖండ 2’ గురించి అంచనాలు మరింత ఎత్తుకు చేరాయి. ఈ సినిమాలో సం యుక్తా మీనన్ హీరోయిన్ గా నటించారు.
అభిమానులు మాత్రమే కాదు, సినిమా లవర్స్ కూడా ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ట్రైలర్, టీజర్‌లు ఇచ్చిన హైప్ కారణంగా సోషల్ మీడియా అంతా “అఖండ ఫీవర్”తో నిండి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డైలాగ్‌ను బాలయ్య సినిమా రిలీజ్‌కు కనెక్ట్ చేస్తూ నెటిజన్లు పోస్ట్‌లు చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. మొత్తానికి, అఖండ 2 రిలీజ్ ముందు నుంచే సోషల్ మీడియా లో రచ్చ జరుగుతోంది. సినిమా విడుదలైన తర్వాత ఈ హడావిడి ఇంకా ఎంత రెట్టింపు అవుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి