తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి శ్రీను ని యాంకర్ పవన్ కళ్యాణ్ తో మీరు ఎప్పుడు సినిమా చేస్తారంటూ ప్రశ్నించారు?.అందుకు బోయపాటి సమాధానం చెబుతూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారని, అభిమానుల కోసం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. దీంతో లిమిటెడ్ డేట్స్ కూడా ఇస్తున్నారని, తనతో సినిమా తీయాలి అంటే అలాంటి లిమిటెడ్ డేట్స్ లో తాను సినిమా చేయలేనని, నాకు హీరోల డేట్స్ బల్క్ లో కావాలని తెలియజేశారు బోయపాటి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పవన్ కళ్యాణ్ బల్క్ లో డేట్స్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఆయనతో సినిమా చేయకపోవడమే బెటర్ అని ఆలోచిస్తున్నానని తెలిపారు బోయపాటి.
పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని నాకు ఉంది. కానీ అది కుదరకపోవచ్చేమో అంటూ తన మనసులో మాటను తెలియజేశారు బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి శ్రీను చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇటీవల అఖండ 2 సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా బోయపాటి శ్రీను ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అఖండ 2 చిత్రాన్ని భారత ప్రధానమంత్రి మోడీ త్వరలో ప్రత్యేక ప్రదర్శనతో వీక్షించబోతున్నారని తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి