ఇదంతా ఇలా ఉండగా తాజాగా హైపర్ ఆది, యాంకర్ సౌమ్యరావుతో కలిసి డాన్స్ వేస్తూ ఉన్న ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే అది కూడా స్విజర్ ల్యాండ్ లో వెకేషన్ కి వెళ్లి మరి నా మనసుకేమయింది నీ మాయలో పడిందని పాటకు స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది. ఈ వీడియోని జబర్దస్త్ షోలో కమెడియన్ గా పేరు సంపాదించిన శాంతి స్వరూప్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ మై ఫేవరెట్ జోడి అంటూ క్యాప్షన్ ని జోడించింది.
దీంతో వీరిద్దరూ సన్నిహితంగా ఉంటూ డాన్స్ చేస్తూ ఉన్న ఈ వీడియో చూసిన పలువురు అభిమానులు, నేటిజన్స్ ఈ వీడియోని వైరల్ గా చేస్తున్నారు. మరి కొంతమంది సూపర్ జోడి పెళ్లెప్పుడు అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఏంటి హైపర్ ఆదిలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.గతంలో కూడా హైపర్ ఆది, సౌమ్యరావు లవ్ అంటూ పలు రకాల వార్తలు వినిపించాయి. మరి ఈ విషయం పైన అటు సౌమ్యరావు కానీ హైపర్ ఆది గాని ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారెమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి