కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ చాలా సంవత్సరాల క్రితం కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో రూపొందిన పడియప్ప అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రజినీ కాంత్ కు జోడిగా సౌందర్య , రమ్య కృష్ణ నటించగా ... ఈ మూవీ లో రమ్య కృష్ణ కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ మూవీ లో రమ్య కృష్ణ తన అందాలతో మాత్రమే కాకుండా అద్భుతమైన నటనతో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ లోని రజినీ కాంత్ , సౌందర్య , రమ్య కృష్ణ ముగ్గురి నటనలకు అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి లభించిన ముఖ్యంగా రమ్య కృష్ణ కెరియర్ లో మాత్రం ఈ సినిమా అద్భుతమైన స్థాయిలో నిలిచిపోయింది. ఈ సినిమాను ఆ సమయంలో తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు.

తమిళ్ లో ఈ సినిమాను పడియప్ప అనే పేరుతో విడుదల చేయగా తెలుగు లో నరసింహ అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ అటు తమిళ్ , ఇటు తెలుగు రెండు బాక్స్ ఆఫీస్ ల దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తాజాగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ఇప్పటి వరకు మూడో రోజున బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కాయి. మొదటి రోజు ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా 16 లక్షల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 21 లక్షలు , మూడవ రోజు 23 లక్షల కలెక్షన్లు దక్కాయి. ఇలా ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు , రెండవ రోజు పోలిస్తే మూడవ రోజు ఎక్కువ కలెక్షన్లు దక్కడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: