తెలుగు సినీ నటుడు శివాజీ ఇటీవల మహిళల దుస్తులపైన చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంపై సినీ సెలబ్రిటీలే కాకుండా, సామాన్య ప్రజలతోపాటు,నెటిజన్స్ కూడా విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఈ రోజున తెలంగాణ మహిళా కమిషనర్ ఎదుట విచారణకు హాజరయ్యారు శివాజీ. దండోరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేదిక పైన శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎందుకు మాట్లాడారో తెలుసుకునేందుకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద విచారణ జరిపారు. ఇందులో భాగంగా మహిళా కమిషన్ శివాజీ కి సంబంధించి కొన్ని ప్రశ్నలను వేసింది.



1). మహిళలపై మీరు చేసిన ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవం, వ్యక్తిగత జీవిత పై ప్రభావం చూపుతోందని కమిషన్ భావిస్తోంది.. మీరు ఏమంటారు అంటూ ప్రశ్నించారు?


2). ఒక నటుడిగా మీ వ్యాఖ్యలు సమాజం పైన చాలా ప్రభావాన్ని చూపుతాయి. ఈ విషయం మీకు తెలిసి వ్యాఖ్యలు చేశారని కమిషన్ భావిస్తోంది..


3). మహిళ వస్త్రధారణ ఆధారంగా వాళ్ల వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం.. చదువుకున్న వ్యక్తిగా మీకు ఇలాంటి విషయాలు తెలియదా?


4). మీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్లు కానట్లు అయితే వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని ప్రశ్నించారు.


5). మీ వ్యాఖ్యలు మహిళలపై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదుల వచ్చాయి వీటికి మీ సమాధానం ఏంటి అంటూ ప్రశ్నించారు?


సుమారుగా రెండు గంటలపాటు విచారణలో భాగంగా శివాజీకి ఈ ప్రశ్నలు వేసినట్లు తెలిసింది.. మరి ఈ ప్రశ్నలకు శివాజీ ఎలాంటి సమాధానాలు తెలిపారనే విషయం తెలియాల్సి ఉంది.



మహిళల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి.. శివాజీ చెప్పిన విషయం కరెక్టే అయినా ఆయన మాట్లాడిన విధానం తప్పని చాలా మంది స్పందిస్తున్నారు. ఈ విషయంపై శివాజీ కూడా క్షమాపణలు తెలిపారు. నేడు ఈయన విచారణకు హాజరు కావడంతో ఇప్పటికైనా ఈ వివాదం ముగుస్తుందా లేదా కొనసాగుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: