హీరో రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో (జనవరి 13) విడుదలైన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలో రవితేజ కి జోడిగా డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ నటించారు. చాలా గ్యాప్ తర్వాత ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాలో నటించినట్లుగా ట్రైలర్లో చూపించారు. తన మాస్ ఇమేజ్ను పక్కనపెట్టి మరి నటించారు రవితేజ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం.


భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా స్టోరీ విషయానికి వస్తే.. అప్పటికే వివాహమైన రామ్ సత్యనారాయణ (రవితేజ) స్పెయిన్ పర్యటనలో మానస (ఆషికా రంగనాథ) కు దగ్గరవుతారు. అయితే తన భార్య బాలమణి (డింపుల్ హయాతి) కి రామ్ కి మధ్య జరిగిన ఘర్షణ ఏంటి? రామ్ జీవితంలోకి మానస వచ్చిన తర్వాత ఎదురైన పరిస్థితులు ఏంటి? అటు భార్యను, ప్రేయసిని ఎలా హ్యాండిల్ రామ్ చేశారు అనేది ఈ సినిమా కథ.


భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో మొదటి భాగం చాలా వినోదాత్మకంగానే నడుస్తుంది. స్టోరీ పెద్దగా లేకపోయినా కామెడీతోనే ముందుకు సాగుతుంది. ఈ చిత్రంలో ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలెట్ ఉండడమే కాకుండా సునీల్ ఎపిసోడ్, వెన్నెల కిషోర్, సత్య కామెడీ కూడా బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆషికా రంగనాథ్ గ్లామర్ కూడా ఈ సినిమాకి పాజిటివ్గానే ఉంది. కానీ ఈ సినిమా రన్ టైమ్ కాస్త ఎక్కువగా ఉందని నేటిజన్స్ సైతం కాను కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది వింటేజ్ రవితేజ చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేయగా, ఓవరాల్ గా ఫస్ట్ ఆఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కూడా బాగుంది, క్లైమాక్స్ వరకు ఫుల్ కామెడీతో సాగుతుంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ ఖాతాలో మరో హిట్ పడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పూర్తి రివ్యూ తెలియాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: