శ్రీను వైట్ల సినిమాల్లో ఉండే ఆ టిపికల్ బాడీ లాంగ్వేజ్, ఫన్నీ క్యారెక్టరైజేషన్లు మళ్ళీ ఈ సినిమాలో కనిపించబోతున్నాయట. తాజా సమాచారం ప్రకారం, 'మ్యాడ్' మరియు '8 వసంతాలు' సినిమాలతో యూత్‌ను ఆకట్టుకున్న కేరళ కుట్టి అనంతిక సనీల్ కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించబోతున్నారు. శర్వానంద్ లాంటి వెర్సటైల్ నటుడు, అనంతిక లాంటి యంగ్ బ్యూటీ మధ్య స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.శర్వానంద్‌కు సంక్రాంతి అంటే ఒక సెంటిమెంట్. అందుకే ఈ సినిమాను కూడా సంక్రాంతి 2027 లో విడుదల చేస్తామని శర్వా అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. అంటే వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద శర్వానంద్ గర్జన పక్కా అన్నమాట. ఈ సినిమాలో మరో సీనియర్ నటుడు మరియు ఒక మలయాళ హీరో కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కథ పరంగా చూస్తే.. హీరో యంగ్ ఏజ్‌లో ఆవేశంలో చేసిన ఒక పని వల్ల అతని లైఫ్‌లో జరిగే డ్రామా చాలా ఫన్నీగా, ఎమోషనల్‌గా ఉండబోతోందట.
నిరంతరం విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్, శ్రీను వైట్లను మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకురావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. 'విశ్వం' సినిమాతో కాస్త మెప్పించిన శ్రీను వైట్ల, ఈసారి శర్వాతో కలిసి ఒక ప్రాపర్ కమర్షియల్ హిట్ కొట్టాలని కసరత్తులు చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లోనే షూటింగ్ ప్రారంభించి, వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.మొత్తానికి శర్వానంద్ తన సక్సెస్ జర్నీని శ్రీను వైట్లతో కొనసాగించబోతున్నారు. నవ్వులే ఆయుధంగా రాబోతున్న ఈ 'క్రేజీ కాంబో' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. శర్వానంద్ ఫ్యాన్స్‌కు మాత్రం 2027 సంక్రాంతికి ముందే పండగ గిఫ్ట్ కన్ఫర్మ్ అయ్యింది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి