ఈ సినిమాలోని విలన్ పాత్ర కోసం సీనియర్ నటుడుగా పేరు సంపాదించిన తనికెళ్ల భరణి నటించబోతున్నట్లు తెలుస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం తాను ఒక పెద్ద ప్రాజెక్ట్ లో విలన్ పాత్రలో కనిపించనున్నాను, కెరియర్ మొదట్లో చేసిన ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే మళ్లీ ఇన్నేళ్లకు నాకు అవకాశాన్ని కల్పించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. నాచురల్ స్టార్ నాని లాంటి టాలెంటెడ్ హీరోతో తనికెళ్ల భరణి వంటి దిగ్గజ నటలు తలపడడం అంటే ఇక వెండితెర మీద ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో స్నేహం గురించి చూపించిన డైరెక్టర్ ఈసారి ప్యారడైజ్ చిత్రంలో తల్లి , కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ అని చూపించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ తో పాటుగా, ఎమోషనల్ గా హృదయాన్ని హాత్తుకొని సెంటిమెంట్ కూడా ప్రధాన ఆకర్షణీయంగా నిలవనుంది. 2026 మార్చి 26న ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంకా షూటింగ్ పెండింగ్లో ఉండడంతో రాబోయే రోజుల్లో రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి