ఇష్క్ ఫేమ్ దర్శకుడు విక్రమ్ కె కుమార్‌తో నితిన్ మరోసారి సినిమా చేయబోతున్నాడనే వార్త గతంలో గట్టిగా వినిపించింది. ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయితే నితిన్‌కు బిగ్ కంబ్యాక్ ఖాయం అని అభిమానులు ఆశించారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. అదే విధంగా దర్శకుడు ఆదిత్య హాసన్ రూపొందిస్తున్న ‘ఎపిక్’ సినిమాలో మొదట నితిన్‌నే హీరోగా అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చివరకు ఆనంద్ దేవరకొండ వద్దకు వెళ్లింది.ఇక వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో కూడా తొలుత నితిన్ నటిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఆయన చేతుల నుంచి జారిపోయి, చివరకు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఫైనల్ అయ్యాడు. ఇలా వరుసగా అవకాశాలు చేజారిపోవడంతో నితిన్ కెరీర్‌పై అనిశ్చితి మరింత పెరిగిందనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో నితిన్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో ఓ సినిమాకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అదే సమయంలో లేడీ డైరెక్టర్ నీరజ కోన దర్శకత్వంలో కూడా మరో సినిమా లైన్‌లో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులలో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళ్లబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మొత్తానికి వరుస ఫ్లాప్‌లతో వెనుకబడిన నితిన్, ఈ కొత్త సినిమాల ద్వారా మళ్లీ తన పాత ఫామ్‌ను తిరిగి పొందగలడా? అభిమానులు ఆశించే స్థాయిలో కంబ్యాక్ ఇవ్వగలడా? అన్నది వేచి చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి