సాధారణంగా సెలబ్రెటీలకు సంబంధించి లవ్, బ్రేకప్, డేటింగ్ వంటి విషయాల పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తుంటాయి. కొందరైతే ఈ విషయాలను ఖండిస్తుండగా మరి కొంతమంది సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ప్రేమలో ఉన్నామని విషయాన్ని బహిరంగంగానే చెబుతూ ఉంటారు. ఇటీవల హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. హిందూ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో ఉన్నానని తెలియజేసింది. మరో హీరోయిన్ దివ్యభారతి కూడా తన కాలేజీలో తన లవ్ బ్రేకప్ విషయాన్ని తెలియజేసింది. గత కొంతకాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ గురించి కూడా రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరొక హీరోయిన్ సైతం తన రిలేషన్షిప్ విషయాన్ని బయట పెట్టింది.



హీరోయిన్ ఎవరో కాదు ప్రియా భవాని శంకర్. మొదట న్యూస్ రీడర్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత సీరియల్స్ లో నటించి నెమ్మదిగా సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈమె నటించిన హాట్ స్పాట్ 2 సినిమా థియేటర్లో విడుదలైంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన రిలేషన్షిప్ గురించి రూమర్స్ వినిపించగా.. తన ప్రియుడుతో విడిపోయారనే రూమర్స్ లో వాస్తవం లేదంటూ ప్రస్తుతం తన స్నేహితుడు రాజ్ వెల్ తో తను ప్రేమలో ఉన్నానట్టు తెలియజేసింది.



ప్రియా భవాని శంకర్ గురించి వైరల్ గా వీడియోలో ఆమె మాట్లాడుతూ.. కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, అతడు చాలా మంచివాడని నమ్మాను.. కానీ అతడు చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశారని తెలిసి ఎక్కువ కాలం ఆ రిలేషన్ షిప్ లో ఉండాల్సిన అవసరం లేదని వదిలేశానని తెలిపింది. అలాంటి టాక్సీక్ రిలేషన్ షిప్ లో ఎవరైనా ఉంటే వెంటనే ఆ బంధానికి గుడ్ బై చెప్పడం మంచిదని తెలిపింది. ప్రస్తుతం ప్రియా భవాని శంకర్ కి సంబంధించి ఏ న్యూస్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: