బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ సినిమాలలో అద్భుతమైన ఔట్ ఫిట్ తో, సిక్స్ ప్యాక్ బాడీతో తన సినిమాలను ఆకట్టుకుంటారు. అలా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న హృతిక్ రోషన్ కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానుల సైతం ఈ వీడియో చూసి ఆందోళన చెందుతున్నారు. హృతిక్ రోషన్ కి ఏమైంది? అనే ప్రశ్న ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అసలు విషయంలోకి వెళ్తే హృతిక్ రోషన్ ఇటీవలే ముంబైలో వాకింగ్ స్టిక్స్ సహాయంతో నడుస్తూ ఉన్నటువంటి ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చే హృతిక్ రోషన్ ఈసారి ఎలాంటి మాటలు లేకుండా నేరుగా స్టిక్ పట్టుకొని  తన కారు వైపుగా వెళ్ళిపోయారు. ఈ వీడియోలో హృతిక్ రోషన్ నడక బాడీ లాంగ్వేజ్ చూస్తే, తన కాళ్లకు ఏదో గాయమైనట్టుగా చాలా క్లియర్ గా కనిపిస్తోంది.


ఇటీవల హృతిక్ రోషన్ తన 52వ పుట్టినరోజుని బాగానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హృతిక్ రోషన్ ఫిట్నెస్ చూస్తే మాత్రం వయసును అంచనా వేయడం కూడా కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా కఠినమైన డైట్, ఎప్పుడు జిమ్ వర్కౌట్స్ తో ఫిట్ గా ఉండే హృతిక్ ఎక్కువగా యాక్షన్ సీన్స్లలో కూడా నటించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి హృతిక్ రోషన్ కి ఎలా గాయమైందనే ప్రశ్న అభిమానుల తలెత్తుతోంది. మరి ఈ విషయంపైన ఆటు హృతిక్ రోషన్ కానీ, ఆయన టీమ్ కానీ క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం క్రిష్ 4 సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: