సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి అనుకున్నది సాధించడానికి టైమ్ పడుతుంది… కానీ సాధించినప్పుడు మాత్రం ఆ ఆనందం డబుల్ అవుతుంది. అచ్చం అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఎప్పటి నుంచో తాను కలిసి నటించాలని కోరుకుంటున్న హీరోతో ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కించుకోవడం నిజంగా ఆమెకు స్పెషల్ మూమెంట్ అనే చెప్పాలి.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రౌడీ జనార్దన’ ఇప్పటికే భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే… ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ ఐటెం సాంగ్ ఉండబోతుందట. ఆ పాటలో విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేయడానికి తమన్నాను ఎంపిక చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇదివరకే ‘జైలర్’ సినిమాలో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, గ్రేస్, ఎనర్జీ అన్నీ కలిపి ఆ పాటను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు అదే తమన్నా, విజయ్ దేవరకొండ సరసన స్టెప్ వేస్తే ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్‌లో మామూలుగా లేదు. పైగా గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో తమన్నా ఓపెన్‌గా “విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని ఉంది” అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మాట నిజం కావడం ఆమె పట్టుదలకి, టైమింగ్‌కు నిదర్శనం అన్నట్టుగా ఉంది.

ఇక సినిమా విషయానికి వస్తే… ‘రౌడీ జనార్దన’లో విజయ్ దేవరకొండను ఇప్పటివరకు చూడని విధంగా చూపించబోతున్నారని సమాచారం. ముఖ్యంగా సినిమాలో వచ్చే ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఆయన ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తాడట. పవర్‌ఫుల్ ఫైట్స్, ఇంటెన్స్ ఎమోషన్స్‌తో ఆ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవబోతుందట. మొత్తం సినిమా అంతా విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ మెయిన్ అట్రాక్షన్‌గా ఉంటాయని మేకర్స్ సర్కిల్ నుంచి టాక్.స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఆయన బ్యానర్ అంటేనే క్వాలిటీకి గ్యారంటీ అన్న ఇమేజ్ ఉంది కాబట్టి, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు సహజంగానే పెరిగిపోయాయి. మరో విశేషం ఏమిటంటే… ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర, లుక్ మునుపెన్నడూ చూడని విధంగా డిజైన్ చేశారట. రాజశేఖర్ అభిమానులకు ఇది ఒక సర్‌ప్రైజ్ ట్రీట్‌గా నిలవనుందని అంటున్నారు.

కథ విషయానికొస్తే… ‘రౌడీ జనార్దన’ గ్రామీణ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. గ్రామీణ వాతావరణం, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుందనే నమ్మకం టీమ్‌లో ఉంది. విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేశ్ నటించనుండడం మరో ప్లస్ పాయింట్. న్యాచురల్ యాక్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన కీర్తి, విజయ్‌తో కలిసి స్క్రీన్‌పై ఎలా మెరుస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మొత్తానికి తమన్నా స్పెషల్ సాంగ్, విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ యాక్షన్, రాజశేఖర్ డిఫరెంట్ లుక్, గ్రామీణ కథనం… ఇవన్నీ కలిసొచ్చి ‘రౌడీ జనార్దన’ను ఈ మధ్యకాలంలోనే మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలబెట్టాయి. రిలీజ్ దగ్గరపడే కొద్దీ ఈ సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: