ఇటీవల వ్యాపారవేత్త మెఘా కృష్ణారెడ్డి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి స్పెషల్ ఈవెంట్‌లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున కలిసి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురువారెడ్డి ఈ ముగ్గురు హీరోలతో కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే ఇక్కడే అభిమానుల దృష్టి మరోసారి ఒక విషయంపై పడింది.ఈ ఫోటోలో బాలకృష్ణ కనిపించలేదు.ఇది ఒక్కసారి జరిగిన విషయం కాదు. ఇటీవల జరిగిన బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ నట ప్రస్థానం వేడుకలో బాలయ్య, చిరంజీవి, వెంకటేష్ హాజరయ్యారు కానీ నాగార్జున మాత్రం రాలేదు.
అంతకు ముందు మరో ఈవెంట్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కలిసి కనిపించారుఅయితే ఆసారి బాలకృష్ణ మిస్ అయ్యారు.ఇలా గమనిస్తే ఒక విచిత్రమైన ప్యాటర్న్ కనిపిస్తోంది.ఎప్పుడూ ముగ్గురు హీరోలే కనిపిస్తున్నారు…కానీ నలుగురు కలిసి మాత్రం కనిపించడం లేదు.దీంతో నెటిజన్లు, అభిమానులు రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు...“ఇది కేవలం అనుకోకుండా జరుగుతోందా?”..“లేదా బాలయ్య – నాగార్జున మధ్య ఏదైనా అపోహలున్నాయా?”..“లేదా వ్యక్తిగత కారణాల వల్ల కలిసి కనిపించడంలేదా?”
ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.అయితే ఇప్పటివరకు ఈ విషయంలో ఎవరు అధికారికంగా స్పందించలేదు. నిజానికి ఈ నలుగురు సీనియర్ హీరోలు టాలీవుడ్‌కు నాలుగు స్థంభాల్లాంటివారు. వాళ్ల మధ్య విభేదాలున్నాయన్న వార్తలకు ఎలాంటి ఆధారాలు కూడా లేవు.అయినా సరే… అభిమానుల మనసులో మాత్రం ఒక కోరిక అలాగే ఉంది.నలుగురు హీరోలు కలిసి ఒకే వేదికపై కనిపిస్తే చూడాలి అన్న ఆశ.మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో, బాలకృష్ణ – నాగార్జున ఇద్దరూ చిరంజీవి, వెంకటేష్‌లతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఎప్పుడు కనిపిస్తారో కాలమే చెప్పాలి.అప్పటివరకు మాత్రం ఈ చర్చ ఆగేలా కనిపించడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి