ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ విభాగంలో పనిచేస్తున్న ప్రజ్వల్ గౌడ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పంచుకోవడంతో ఈ అప్‌డేట్ అధికారికంగా బయటకు వచ్చింది. ప్రస్తుతం పూర్తి చేసిన షెడ్యూల్‌కు సంబంధించిన ఫుటేజ్ అద్భుతంగా వచ్చిందని, టీమ్ మొత్తం చాలా సంతృప్తిగా ఉందని టాక్. ఇక తదుపరి షెడ్యూల్ కూడా చాలా త్వరలోనే ప్రారంభం కానుందని చిత్ర బృందం నుంచి సమాచారం.ఇక ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇది ఒక ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్గా తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, పవర్‌ఫుల్ ఎలివేషన్స్, ఇంటెన్స్ సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయట. ముఖ్యంగా ఎన్టీఆర్‌ని ఇప్పటివరకు చూడని ఓ కొత్త షేడ్‌లో చూపించేందుకు ప్రశాంత్ నీల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని టాక్.
ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా నిలవాలని ప్రశాంత్ నీల్ గట్టిగా ఫిక్స్ అయ్యాడట. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఆయన చాలా సమయం కేటాయించాడు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి యాక్షన్ బ్లాక్ చాలా పర్ఫెక్ట్‌గా ఉండేలా స్క్రిప్ట్‌ను డిజైన్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమాలన్నింటిలోకీ ఇదే బెస్ట్ మూవీ అవుతుందనే అంచనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ నిర్మాణ విలువలు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టెక్నికల్ టీమ్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరి పాత్రలు కథలో చాలా ముఖ్యమైన మలుపులు తీసుకొస్తాయని సమాచారం.అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ భారీ చిత్రం ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్ నిజంగా ఏ స్థాయి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి