టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత భారీ అంచనాలు నెలకొన్న ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా నిలిచింది సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ జరిగిన నాటి నుంచే దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టి మొత్తం ఈ ప్రాజెక్ట్‌పైనే కేంద్రీకృతమైంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తొలిసారి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ఈ చిత్రం ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మహేష్ బాబు ప్రెజెన్స్ – అన్నీ కలిపి సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి.

ఈ సినిమాతో మరోసారి రాజమౌళి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తారని సినీ విశ్లేషకులు ధీమాగా చెబుతున్నారు.ఇక తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మేకర్స్ ప్రమోషన్స్‌ను గుట్టుచప్పుడు కాకుండా స్టార్ట్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో పలు చోట్ల వెలిసిన భారీ హోర్డింగులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ హోర్డింగులపై స్పష్టంగా “2027 ఏప్రిల్ 7న థియేటర్లలో” అనే తేదీ దర్శనమిచ్చింది. దీంతో ఇది ‘వారణాసి’ మూవీ అధికారిక రిలీజ్ డేట్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ వార్త బయటకు రావడంతో మహేష్ బాబు అభిమానుల్లో ఆనందం మామూలుగా లేదు. రాజమౌళి సినిమాకు సరైన సమయాన్ని ఎంచుకున్నారని, సమ్మర్ సీజన్‌లో రిలీజ్ కావడం వల్ల కలెక్షన్ల పరంగా భారీ లాభాలు ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతేకాదు, ఈ రిలీజ్ డేట్ మరో స్టార్ హీరో అభిమానులకు కూడా ఊరట కలిగించే అంశంగా మారింది.అదేంటంటే… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే మేకర్స్ అధికారికంగా 2027 మార్చి 5న ‘స్పిరిట్’ థియేటర్లలోకి రాబోతోందని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ‘స్పిరిట్’కు, ‘వారణాసి’కి మధ్య దాదాపు ఒక నెల గ్యాప్ ఉండటం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రెండు భారీ చిత్రాలు ఒకదానికొకటి బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ పోటీ లేకుండా విడుదల కావడం వల్ల, రెండూ కూడా దీర్ఘకాలికంగా సాలిడ్ రన్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా ఈ వార్తతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.మొత్తానికి, ‘వారణాసి’ రిలీజ్ డేట్ చుట్టూ సాగుతున్న ఈ చర్చ మరోసారి ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేస్తోంది. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ ఇండియన్ సినీ చరిత్రలో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: