ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… ఈ పేరు వినగానే స్టైల్, స్వాగ్, డెడికేషన్ అన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ప్రస్తుతం ఆయన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నాడు. వరుసగా భారీ ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ, పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకుని, ఉత్తరాది ప్రేక్షకుల నుంచి కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించిన బన్నీ, ఇప్పుడు తన తదుపరి సినిమాలతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్స్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పైనే భారీ అంచనాలు ఉండగా, తాజాగా మరో సంచలన ప్రకటనతో ఆయన అభిమానులను ఖుషీ చేశాడు. తన కెరీర్‌లో 23వ చిత్రాన్ని, ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో క్రేజీ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించాడు. ఈ ప్రకటనతోనే టాలీవుడ్ మాత్రమే కాదు… కోలీవుడ్, బాలీవుడ్ సహా యావత్ ఇండియన్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తాత్కాలికంగా ‘AA23’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై రోజుకో వార్త బయటకు వస్తోంది. లోకేష్ కనగరాజ్ అంటేనే ఇంటెన్స్ యాక్షన్, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్, రా అండ్ రియలిస్టిక్ నేరేటివ్. అలాంటి దర్శకుడి స్టైల్‌కు అల్లు అర్జున్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో మామూలుగా లేదు. ఈ సినిమా పూర్తిగా కొత్త షేడ్‌లో బన్నీని చూపించబోతుందని ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటికే ఊహాగానాలు మొదలుపెట్టేశాయి.

ఈ క్రమంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి హీరో, దర్శకుడు, నిర్మాతలు, అలాగే సంగీత దర్శకుడిని మాత్రమే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హీరోయిన్ విషయంపై మాత్రం పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. అయితే లోకేష్ కనగరాజ్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

శ్రద్ధా కపూర్ అంటేనే బ్యూటీతో పాటు నటనకు మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్. బాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రద్ధా, ప్రభాస్ సరసన ‘సాహో’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ సినిమా మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, శ్రద్ధా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అప్పటి నుంచి ఆమె తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంటుందేమో అని అభిమానులు ఆశించారు. కానీ ఆ తర్వాత ఆమె పూర్తిగా బాలీవుడ్ ప్రాజెక్టులపైనే ఫోకస్ పెట్టింది.ఇప్పుడు అల్లు అర్జున్లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో శ్రద్ధా కపూర్ పేరు వినిపించడంతో, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు. “బన్నీ పక్కన శ్రద్ధా కపూర్ అయితే స్క్రీన్ మీద అదిరిపోయే కెమిస్ట్రీ ఉంటుంది”, “పుష్ప టైమ్‌లోనే ఈ జోడీ సెట్ కావాల్సింది కానీ కుదర్లేదు”, “ఇప్పటికైనా లోకేష్ ఈ కాంబోను ఫైనల్ చేస్తే పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డులు బ్రేక్ అవుతాయి” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక క్లారిటీ మాత్రం రాలేదు. కేవలం సోషల్ మీడియా కథనాలే తప్ప, శ్రద్ధా కపూర్ నిజంగానే ఈ సినిమాలో భాగమవుతుందా? లేక ఇది ఫ్యాన్స్ ఊహాగానాలకే పరిమితమా? అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఇస్తాడు కాబట్టి, ఈ పాత్రకు బలమైన నటనతో పాటు పాన్ ఇండియా అప్పీల్ ఉన్న హీరోయిన్‌ను ఎంపిక చేస్తారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

మొత్తానికి ‘AA23’ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతుందనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. అట్లీ సినిమా ఒకవైపు, లోకేష్ కనగరాజ్ సినిమా మరోవైపు… ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో బన్నీ ఇండియన్ సినిమాను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్ ఫైనల్ అవుతుందా లేదా అన్నది మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం ఖాయం… ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న హైప్ మాత్రం రోజురోజుకీ డబుల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: