తర్వాత వచ్చిన “సైరా నరసింహారెడ్డి”లో చిరంజీవి ఒక స్థిరమైన, గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. చారిత్రక నేపథ్యంలోని పాత్ర కావడంతో ఆయన నటనలో పరిపక్వత కనిపించింది. అయినప్పటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర భావోద్వేగ పరంగా మరింత బలంగా ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు.అదే విధంగా “ఆచార్య”, “గాడ్ ఫాదర్”, “వాల్తేరు వీరయ్య” వంటి సినిమాలు ప్రధానంగా మెగాస్టార్ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిన కమర్షియల్ చిత్రాలుగా నిలిచాయి. ముఖ్యంగా “వాల్తేరు వీరయ్య”లో చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అలరించాయి. ఈ తరహా పాత్రలు ఆయనకు సహజంగా సరిపోతాయి. ప్రేక్షకులు ఆయనను చూస్తే చాలు అనే స్థాయిలో ఉన్న స్టార్ పవర్ ఈ సినిమాల విజయానికి ఒక కారణమని చెప్పవచ్చు.
అయితే ఇటీవలి “మన శంకరవరప్రసాద్ గారు” సినిమాలో మాత్రం చిరంజీవిలోని నటుడిని కొత్త కోణంలో చూపించే ప్రయత్నం జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఈ పాత్రలో ఆయన మరింత సహజంగా, జీవితానికి దగ్గరగా కనిపించారని ప్రేక్షకులు భావిస్తున్నారు. దర్శకుడు పాత్రను క్లిష్టంగా మార్చే ప్రయత్నం చేయకుండా, చిరంజీవిలోని పాత సహజత్వాన్ని బయటకు తీసుకురావడంపై దృష్టి పెట్టడం వల్ల ఆ పాత్ర ప్రేక్షకులకు దగ్గరైంది. దీంతో ఆయన ఆ పాత్రలో సులభంగా లీనమయ్యారని చెప్పొచ్చు.ఇప్పుడు ఆయన తదుపరి సినిమా గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. “దసరా”తో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఒక సినిమా చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రం గాఢమైన కథతో, శక్తివంతమైన పాత్రతో రూపొందుతుందని వినిపిస్తోంది. కథా నిర్మాణం నుంచి పాత్ర రూపకల్పన వరకు దర్శకుడు చాలా సమయం తీసుకుని పనిచేశాడని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆ సినిమా చిరంజీవిని మరోసారి కొత్తగా చూపించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు ప్రేక్షకులు చూసిన పాత స్వాగ్‌తో పాటు, అనుభవం కలిసిన కొత్త నటనను ఈ సినిమాలో చూడొచ్చని అంచనాలు ఉన్నాయి.మొత్తానికి చెప్పాలంటే .. చిరంజీవి కంబ్యాక్ తర్వాత వచ్చిన సినిమాలు ప్రధానంగా ఆయన మాస్ ఇమేజ్ చుట్టూనే తిరిగినప్పటికీ, సరైన కథ మరియు పాత్ర దొరికితే ఆయనలోని గొప్ప నటుడు ఇంకా చాలా చేయగలడనే నమ్మకం అభిమానుల్లో ఇప్పటికీ ఉంది. భవిష్యత్ సినిమాలు ఆ నటుడిని మరింతగా బయటకు తీసుకువస్తాయా లేదా అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి