అక్కినేని ఫ్యామిలీలో హీరోలందరూ కలిసి ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నారు. అలాగే తన కొడుకు, మనవళ్ళతో కలిసి తాను నటిస్తానని అందుకు తగిన స్క్రిప్ట్ ఉంటే ఎవరైనా చెప్పాలని రామానాయుడు ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆ కోరిక మోహన్ బాబులోనూ మొదలైంది. తన ఇద్దరు కొడుకులు హీరోలు. ఇటీవలే తనయ కూడా నటనా రంగంలో అడుగుపెట్టింది. వారి ముగ్గురితో కలిసి తెలుగులో నటించాలని అనుకుంటున్నారు. అందుకోసం ఆయన స్క్రిప్టులను వెతికే పనిలో ఉన్నారట. అప్పుడా చిత్రం నిజమైన మల్టీ స్టారర్ గా మిగులుతుందని అంటున్నారట. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలుగులో ఓ కథన సిద్ధం చేయమని సన్నిహితులకు సలహా ఇస్తున్నారట డైలాగ్ కింగ్. ఇటీవల హిందీలో హిట్ అయిన ఓ సినిమాను కొనే ప్రయత్నంలో కూడా ఉన్నారని వినికిడి.  

మరింత సమాచారం తెలుసుకోండి: