ప్రముఖ హస్యనటుడు బ్రహ్మనందం నటిస్తున్న సినిమా ‘జఫ్ఫా’. ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు అశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. దీనికి అనేక కారణాలను పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
బ్రహ్మానందం ప్రధాన పాత్రను పోషించిన సినిమాలు గతంలో విజయవంతం కాలేదు. అలాగే ‘జఫ్పా’ సినిమా దర్శకుడు వెన్నల కిషోర్ పై ఎలాంటి అంచనాలు లేవు. అతను తీసిన ‘వెన్నెల 11/2’ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. పరమ చెత్త చిత్రంగా వ్యాఖ్యలు వచ్చాయి. దర్శకుడిగా వెన్నెల కిషోర్ పనికిరాడనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇటీవలే విడుదల అయిన జఫ్పా ట్రైలర్స్ కూడా వెన్నెల కిషోర్ పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ‘జఫ్పా’ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు.
కాగా, ఈ నెల 29న విడుదల అవుతున్న మరొక చిత్రం కోసం కొంత మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజున ‘అరవింద్-2’ విడుదల అవుతుంది. గతంలో విజయవంతమైన ‘ఎ ఫిల్మ్ బై ఆరవింద్’ కు దర్శకత్వం వహించిన శేఖర్ సూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఆ కొనసాగింపుగా ఈ ‘అరవింద్-2’ సినిమా వస్తుందని దర్శకుడు శేఖర్ సూరి చెపుతున్నాడు. దీంతో సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రాలను ఇష్టపడే వారు ‘అరవింద్-2’ కోసం అసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: