తన అందంతో యావత్తు భారత దేశాన్ని ఒక ఊపు ఊపిన నటి శ్రీదేవి. కాగా, చాలా కాలం తరువాత ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాతో శ్రీదేవి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చాలా రోజుల తరువాత శ్రీదేవి వెండితెర మీద కనిపిస్తుండటంతో అభిమానులు ఆనంద పడుతున్నా.. శ్రీదేవి రీఎంటరీకి అసలు కారణం వేరే ఉందని బాలీవుడ్ మీడియా అంటుంది. సినిమాల్లో నెంబర్1 హీరోయిన్ గా భారీగా సంపాదించిన శ్రీదేవి బోనీకపూర్ ను పెళ్ళి చేసుకుని తనతోపాటు, తన ఆస్తినీ అతడి చేతిలో పెట్టింది. అయితే వ్యాపారాలతో పాటు, సినిమాల్లో నష్టాలను ఎదుర్కొన్న బోనీ ఆర్థికంగా ఇబ్బందుల పడుతున్నాడు. దీంతో ఇంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి మళ్ళీ ముఖానికి రంగు వేసుకోక తప్పలేదని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: