మంచు లక్ష్మీ ప్రసన్న ఈ మధ్య సకల కళల వల్లభురాలిగా కనిపించాలని ప్రయత్నిస్తోంది. ఓ వైపు యాంకరింగ్, నిర్మాణం, నటన అంటూ బిజీగా గడిపేస్తోంది. ఇటీవల ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రంలో సోనూసూద్ సరసన పెళ్ళి కూతురుగా నిలుచుంది. తాజాగా గుండెల్లో గోదారి ట్రైలర్ల లోనూ ఆది పక్కన పెళ్ళి మండపంలో కూర్చునే సీన్ ఉంది. లక్ష్మీ పెళ్ళి దుస్తుల్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది. చూడచక్కగా ఉన్న ఆ సీన్లంటే లక్ష్మీకి చాలా ఇష్టమట. అందుకే ఆ సన్నివేశం ఉంటే అవకాశాన్ని వదులుకోవడం లేదు. పైగా ఇటీవల కాలంలో ప్రతినాయిక పాత్రలకు కరెక్ట్ గా లక్ష్మీ సరిపోతుందని పలువురు ప్రశంసిస్తున్నారు. గుండెల్లో గోదారి కూడా తమిళంలో విడుదల కానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: