1947లవ్ స్టోరీ సినిమాలో దొరసానిగా ఆర్య పక్కన నటించిన నటి ఎమీజాక్సన్. ఎవడులో చరణ్ పక్కన నటిస్తోంది. ఇటీవలే తన ప్రియుడు పేరును టాటూగా చేతిమీద వేయించుకుంది. ఆల్ రెడీ తన చేతికి ఉన్న పచ్చబొట్టును తుడిపించుకునే ప్రయత్నాల్లో నయనతార ఉంటే ఎమీ మాత్రం కొత్తగా వేయించుకుంది.‘ ఏదైనా అనుభవంలోకి వస్తే గానీ తెలియదు. ప్రేమ ఉంటే మనసులో ఉంచుకోవాలి గానీ, నటీమణులు మరీ ఇలా బయటపడకూడదు’ అని అంటున్నారంతా. ఎమీ మాత్రం తన జీవితంలో తాను ఇంత ఎత్తు ఎదగడానికి ఓ పురుషుడు కారణమని, అతను మరెవరో కాదు తన తండ్రి అని అందరికీ ఝలక్ ఇస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: