సినిమా ప్రమోషన్ కోసం పబ్లిసిటీకి ప్రత్యేకంగా పాటల్ని సిద్దం చేస్తున్నారు మ్యూజిక్ డైరక్టర్లు. పనిలో పనిగా తామూ మేకప్ వేసుకుని ఓ పాటలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మధ్య దేవిశ్రీ ప్రసాద్ పక్ డో పక్ డో అని అల్లు అర్జున్తో కలిసి చిందులేశారు. నిరంతరం నీ ఊహలే అంటూ జీవీ ప్రకాష్ ఈ మధ్య మైక్ చేతపట్టుకుని కెమెరా ముందుకు వచ్చాడు. అనూప్ కూడా ఈ తరహా ప్రయత్నం ‘ఇష్క్’ సినిమాలో కోడిబోయే లచ్చమ్మది అని పాడాడు. థమన్ బిజినెస్ మేన్ కోసం హఠ్ చలే అంటూ పాడాడు. అనిరుద్ కొలవెరిని రికార్డు చేసిన తీరును పిక్చర్ తీసి మరీ పోస్ట్ చేశాడు. సంగీత దర్శకులు సినిమా ప్రమోషనలో ఈ మధ్య కీలక పాత్రలే పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా కూడా డేవిడ్ బిల్లా చివరి పాట కోసం మేకప్ వేసుకుని కెమెరాముందుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: