శ్రీను వైట్లతో బాద్ షా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన తరువాత సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు.
గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ తో మంచి ఊపు మీద ఉన్న హరీష్ శంకర్ చెప్పిన సబ్జెక్ట్ ఎన్టీఆర్ కు బాగా నచ్చిందని వెంటనే సినిమా చేయడానికి అంగీకరించాడని సమాచారం. కాగా, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెర కెక్కిస్తున్నాడు.
దిల్ రాజు ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో బందావనం అనే సూపర్ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, హరీష్, ఎన్టీఆర్ లతో దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: