వినాయకుడు సినిమాతో ప్రేక్షకుల వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణుడు. వినాయకుడు సినిమా విజయవంతం అవ్వడంతో అతనితో సినిమాలు రూపొందించడానికి
నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు.
తాజాగా కృష్ణుడు నటించిన నగరంలో వినాయకుడు సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ అంత అంత మాత్రంగా ఉంది. వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, నగరంలో వినాయకుడు వంటి పేర్లతో జనాలు గందర గోళానికి గురవుతున్నారని చిత్ర యూనిట్ అంటుంది.
అయితే, ‘నగరంలోకి వినాయకుడు’ వచ్చినా థీయేటర్లలోకి ప్రేక్షకులు రాలేదని ఫిల్మ్ నగర్ జనాలు కామెంట్ చేస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: