వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న నాయిక్ సినిమా తాజా షెడ్యూల్ గ్రీస్ దేశంలో జరుగుతుంది. అక్కడ ఈ నెల 20 నుంచి 15 రోజుల పాటు వివిధ లోకేషన్లలో ముఖ్య పాత్ర దారుల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు.
ఈ సినిమాకు ఆకుల శివ అద్భుతమైన కథ ఇవ్వడంతో పాటు, మంచి మాటలు రాశారని నిర్మాత డివివి దానయ్య తెలిపారు. నాయక్ సరసన కాజల్, అమలాపాల్ నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
కాగా, ఈ నాయక్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి