మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేకవీరుడు, అతిలోక సుందరి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసింది. అశ్వనీదత్ వైజయంతి మూవీస్ పతాకంపై అప్పుడు నిర్మించారు. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ కథను కోనవెంకట్ సిద్ధం చేసి అశ్వనీదత్ కు వినిపించారు. వినోదాత్మకంగా సాగే ఈ కథను శ్రీనువైట్ల చేతిలో పెట్టారు దత్తు. మెగా తనయుడు చరణ్ ఈ సీక్వెల్ లో నాయకుడు. ఈ సినిమాలో నటించడానికి గానూ అశ్వనీదత్ చరణ్ కు పెద్ద మొత్తంలో డబ్బును ఆఫర్ చేశారట. ఏదేమైనా జూనియర్ జగదేకవీరుడు సిద్ధం కానున్నాడు. ‘నాయక్’, ‘ఎవడు’, ‘జంజీర్’ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. శ్రీనువైట్ల కూడా బాద్షా బిజీలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: