‘‘హరోయిన్ వేషం వేశాక నేను ఈ డ్రెస్ లు వేసుకోను అని దర్శకుల్ని , నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు’’ అని చెప్తోంది కాజల్. అల్ట్రా మోడ్రన్ డ్రస్సుల్లో తనను తాను చూసుకోవడానికి కాజల్ ఏ మాత్రం ఇబ్బంది పడదట.  ఈ విషయాన్ని గురించి చెప్తూ ‘‘నేను ఓ సినిమాకు సంతకం చేసేటప్పుడే ఆ క్రూ ఏం చెప్తే అది చేయాలని నిర్ణయించుకుంటాను. పాత్ర డిమాండ్ ను బట్టి, ఏ లుక్ కావాలో అలా డ్రస్ డిజైన్ చేయిస్తారు యూనిట్. దాన్ని వేసుకుని నటించడమే నా వృత్తి. అలాంటప్పుడు లేనిపోని గొడవలెందుకు? కేవలం వేసుకున్న డ్రస్సుల్ని బట్టి, హాట్ ఫోటో షూట్లను బట్టి నటీమణుల టాలెంట్ లను ఎవరూ అంచనా వేయలేరు’’ అని చెప్పింది కాజల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: