రామ్ చరణ్ తొలిసారిగా అన్నదమ్ముల్లా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా నాయక్. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ నాయక్. రామ్ చరణ్ తొలిసారిగా డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, అమలాపాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.
కాగా, రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ఒక పాత్ర పూర్తి నిడివి కామెడీ పాత్రగా సాగుతుందట. రామ్ చరణ్ ఇప్పటి వరకూ కామెడీ పాత్రలు పోషించలేదు. అయితే చిరుత, మగధీర, రచ్చ వంటి యాక్షన్ సీనిమాలతో మెప్పించిన రామ్ చరణ్ కామెడీ పాత్రతోనూ జనాన్ని మెప్పిస్తాడని చిత్ర యూనిట్ అంటుంది. తండ్రి చిరంజీవి మాదిరిగానే రామ్ చరణ్ కూడా అన్ని రకాల పాత్రలతో రాణిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: