షిరిడి సాయిగా హీరో నాగార్జున నటిస్తున్న సినిమా షిరిడి సాయి. ఈ నెల 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న షిరిడి సాయి సినిమాకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. గతంలో నాగార్జున-కె.రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన భక్తి రస చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు సూపర్ హిట్టయ్యాయి. దీంతో వీరి కలయికలో వస్తున్న మూడవ భక్తిరస చిత్రం షిరిడి సాయి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సాధారణ సినిమా అభిమానులే కాకుండా, సాయిబాబా భక్తులు కూడా షిరిడి సాయి సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కారణంగా షిరిడి సాయి సినిమాకి భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. నాగార్జున కెరీర్ లోనూ అత్యధిక రేట్లకు షిరిడి సాయి సినిమాను బయ్యర్లు తీసుకున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక షిరిడి సాయి సినిమా గురించి ప్రేక్షకులకు ఆసక్తి పెరగడానికి మరో ముఖ్య కారణం ఈ సినిమా కోసం కీరవాణి సమకూర్చిన పాటలు. అన్నమయ్య, శ్రీరామదాసు.. వంటి ఎన్నో చిత్రాలతో తన ప్రతిభను చాటి చెప్పిన కీరవాణి ఈ షిరిడి సాయి సినిమాతో చెలరేగి పోయారు. ఇప్పటికే విడుదలైన షిరిడి సాయి పాటలు ఇటు సినీ సంగీత ప్రియుల్ని, అటు సాయి భక్తులన్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పది మంది కలసి సంతోషంగా జరుపుకునే వేడుకలలోనూ, దేవాలయాలలోనూ షిరిడి సాయి పాటలు వినిపిస్తూ అందర్నీ అలరిస్తున్నాయి.  షిరిడి సాయి పాటలు ఆదరణ పొందినట్లే, షిరిడి సాయి సినిమా కూడా ప్రజాదరణకు నోచుకుంటుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: