యోగా సుందరి అనుష్క శెట్టి టాలీవుడ్ లో కనిపించడం గగనవైపోతుంది. అక్కినేని నాగార్జునతో డమరకం, ప్రభాస్ సరసన రెబల్ తప్ప మరే చిత్రాలు తెలుగులో అనుష్క చేతిలో లేవు. అరుంధతి సూపర్ హిట్ తరువాత నటిగా తన విశ్వ రూపం ప్రదర్శంచే అవకాశం మళ్లి రాలేదు.
ఎన్నో ఆశలు పెట్టుకుని సముద్ర దర్శకత్వంలో బొమ్మదేవర చంద్ర నిర్మించిన పంచాక్షరీ సినిమా నిరాశనే మిగిల్చింది . మూసా దోరణిలో అరంధతి సినిమా పోలిన కథలు రావడంతో విసిగి పొయింది. వేధం చిత్రం లా వైవిధ్యం ఉన్న కథలతో దర్శక, నిర్మాతలను తన వద్దకు రావాలని అనుష్క అంటుంది.
లేడి ఓరియెంటేడ్ సినిమాల్లో తప్ప హీరోయిన్ గా బుక్క్ చేయడానికి నిర్మాతలు రావటం లేదని అనుష్క అవేదన పడుతుంది. దీంతో సినిమాల సంఖ్య తగ్గి గ్యాప్ పెరుగుతుంది అని డిల్లీ కుట్టీ గాబరా పడుతుంది. అందుకే ప్రస్తుతానికి లేడి ఓరియెంటేడ్ సినిమాలకు దూరంగా ఉంటుంది అనుష్క.
డమరకం, రెబల్ చిత్రలు విడుదల అయితే టాలీవుడ్ లో మరిన్ని చిత్రాల్లో అవకాశాలు వస్తాయి అని ఎదురు చూస్తుంది. అల్లు ఆర్జున్ సరసన నటించాలసిన అనుష్కకు కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం దూరం అయింది. ఇంకా యువ హీరోల సరసన నటించాలసి ఉందని అనుష్క ఎదురు చూస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి