‘దేనికైనా రెడీ’ హిట్టో ఫట్టో ఇంకా తెలీదుగానీ... రోజూ ఈ సినిమా ఎలాగోలా వార్తల్లో ఉండేసరికి హన్సిక తెగ ముచ్చటపడిపోతోంది. చాలా రోజుల నుంచి హిట్ లేకుండా మెల్లగా ఎలాగోలా కెరీర్ నెట్టుకొస్తున్న హన్సికకి ఈ సినిమా కాస్త గుర్తింపు తెచ్చి పెట్టిమాట వాస్తవమే. మరో పక్క ఆ మధ్య తమిళంలో విడుదలైన ఓకేఓకే కూడా అక్కడ ఆమెకి ఫర్వాలేదు అనిపించింది. దాంతో వరుసగా తమిళ చిత్రాలను ఒప్పేసుకుంది. కథ కూడా వినకుండా... అడిగినవారికి అడిగినట్టుగా కాల్ షీట్లు పంచేసింది. ఇక్కడ... తెలుగులో కూడా ఓ మూడు సినిమాలు కమిట్ అయిపోయింది. దాంతో చెన్నైకీ హైదరాబాద్ కీ చక్కర్లు కొడుతోంది. ‘ప్రయాణాలు బాగా ఎక్కువైపోయాయి. రోజూ షూటింగులతో అలసిపోతున్నాను. ఓ పదిరోజుల పాటు విశ్రాంతి దొరికితే బాగుండు’ అని స్నేహితులతో అంటోదిట. సినిమాలు చేతిలో ఉంటే ఇలా వగలు పోవడం... లేకుంటే, కథలు వింటున్నానూ నాకు నచ్చే కథలు ఇంకా దొరకడం లేదు అని చెప్పడం ఈ హీరోయిన్లకు మామూలే కదా. 

మరింత సమాచారం తెలుసుకోండి: