అమెరికా సహా పలు దేశాల్లో ఎన్నారైలు ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది బాధలు పడుతున్నారు. ఉద్యోగాల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కాక ఇప్పుడు చాలా మంది అక్కడి నుంచి వచ్చేయాలి అని భావిస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలియక అక్కడ ఉన్న కొందరు వ్యాపారాలు చేసుకునే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే మన దేశంలోకి వచ్చేసిన ఎన్నారైలు ఇక్కడ కొన్ని వ్యాపారాల మీద ఫోకస్ చేస్తున్నారు అని తెలుస్తుంది.

ఐటి కంపెనీల మీద పెట్టుబడులు పెట్టాలి అని గతంలో ఎన్నారైలు ఎక్కువగా భావించే వారు. అయితే ఇప్పుడు ఎక్కువగా రూట్ మార్చారని అంటున్నారు. వ్యవసాయ రంగంలో లాభసాటి గా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వాణిజ్య పంటలను మెట్ట ప్రాంతాల్లో వేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుస్తుంది. అమెరికా సహా పలు ప్రాంతాల నుంచి వచ్చేసిన ఎన్నారైలు ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. దీనికోసం గాను ఇక్కడ కొందరు భూములు కొనే అవకాశం కూడా ఉండవచ్చు అని భావిస్తున్నారు.

మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది ఏంటీ అనేది చెప్పలేము గాని ఇప్పుడు అయితే దాదాపుగా అవే ప్రయత్నాల్లో చాలా మంది ఉన్నారని టాక్. వాణిజ్య పంటలకు డిమాండ్ పెరగడంతో తెలంగాణాలో ని నిజామాబాద్, మెదక్ జిల్లాలు, ఏపీలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా సాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా వ్యవసాయానికి అనువుగా ఉన్న ప్రాంతాల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అమెరికా నుంచే ఎక్కువగా వస్తున్నారని అంటున్నారు. ఇక పూర్వీకుల నుంచి కూడా వ్యవసాయంతో అనుబంధం ఉన్న ఐటి ఉద్యోగులు ఆ విధంగా కాస్త గట్టిగా కష్టపడుతున్నారు అని టాక్. చూద్దాం మరి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: