
బిడెన్ బృందంలో దాదాపు భారతీయుల సంఖ్యే అధికంగా ఉంది. అందులోనూ మహిళలకి బిడెన్ ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ క్రమంలోనే మరో భారత సంతంతి మహిళా న్యాయవాదికి బిడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. అమెరికా అటార్నీ జనరల్ గా వనితా గుప్తాను బిడెన్ నియమిస్తూ కీలక ప్రకటన చేశారు. అయితే అమెరికా కాంగ్రెస్ ఆమె ఎంపికను అధికారికంగా ధ్రువీకరించిన తరువాత ఆమె మరో రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. అదేంటంటే. వనితా గుప్తా ఎన్నికైతే అమెరికాలో అటార్నీ జరనరల్ గా మొట్టమొదటి శ్వేతజాతీయేతర మహిళగా ఆమె నిలువనున్నారు. బిడెన్ ఆమె ఎంపికపై మాట్లాడుతూ..
వనితా గుప్తా భారత్ నుంచీ వలస వచ్చిన మన కుమార్తె మనం గర్వించదగ్గ కుమార్తె అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అమాయకపు ప్రజల హక్కల కోసం, స్వేఛ్చ కోసం నిస్వార్ధంగా ఆమె పోరాటం చేశారని కొనియాడారు. వనిత గుప్తా గతంలో ఒబామా హయాంలో అడ్మినిస్ట్రేషన్ న్యాయశాఖ విభాగానికి నాయకత్వం వహించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అటార్నీజనరల్ పదవికి తనను ఎంపిక చేయడం పట్ల వనితా గుప్తా స్పందించారు. భారత్ నుంచి వచ్చి ఇక్కడ ఎంతో కీలకమైన పదవికి నేను ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని, నాపై బిడెన్ ఉంచిన నమ్మకానికి న్యాయం చేస్తానని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి