అందుకే మోడీ... ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే ప్రచారం చేసుకున్నారు. అహ్మదాబాద్ లో కరోనా ఉన్నా సరే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇండియా లో కరోనా వ్యాప్తికి కారణం అయ్యారు. అయితే ఇప్పుడు బిడెన్ కచ్చితంగా కొన్ని ఒప్పందాలను రద్దు చేసే దిశగా లేకపోతే మరికొన్ని ఒప్పందాలను భారత్ తో కాకుండా మరో దేశంతో చేసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ఇక భారత్ తో వ్యాపారం చేసే విషయంలో ఆయన కొన్ని కఠిన నిబంధనలను విధించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బిడెన్ కి మోడీ మీద కోపం ఉంది అని చాలా మంది అంటున్నారు. అందుకే కచ్చితంగా మోడీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు అని నమ్ముతున్నారు. అలాగే మోడీ స్నేహం చేస్తున్న ఇతర దేశాలతో కూడా సంబంధాలు బలహీన పడే అవకాశాలు ఉండవచ్చు. చైనా... బిడెన్ విషయంలో చాలా సానుకూలంగా ఉంది. పాకిస్తాన్ తో కూడా బిడెన్ చాలా సన్నిహితంగా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు మోడీ... బిడెన్ తో చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని లేకపోతే భారత్ ఆర్ధికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి