ఆకలి కేకలు, తిండిలేక తిప్పలు. ఆఫ్రికానో లేదా మరో దేశంలో అయితే అది కామన్. అయితే  అమెరికా అగ్రరాజ్యం అదికూడా ఎవరు ఆ బాధ అనుభవిస్తున్నారో తెలుసా అమెరికా సైనిక కుటుంబాలు. టైంకు పిల్లలకు తిండి పెట్టలేక సతమతమైపోతున్నరట ద గ్రేట్ కంట్రీ, అలాగే ఆ కంట్రీకి
రక్షణ  ఇస్తున్నటువంటి సోల్జర్ ఫ్యామిలీస్. అమెరికా అగ్రరాజ్యం, ప్రపంచం పెద్దన్న, పవర్ఫుల్ కంట్రీ, కంటి చూపుతో భూగోళాన్ని శాసించే దేశం. శక్తివంతమైన ఆర్మీతో మరింత శక్తివంతంగా ఆవిర్భవించిన దేశం. కానీ ఇప్పుడు అవే ఆర్మీ కుటుంబాలు ఆకలితో అల్లాడుతున్నాయట.


అమెరికాలో దాదాపు లక్ష అరవై వేల మంది  సైనికులు తమ కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారట. ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు కానీ నిజంగా నిజమని అంటోంది  ఫీడింగ్ అమెరికా సంస్థ. కరోణ వైరస్ దాటికి అమెరికాలో అనేక కుటుంబాలు అల్లాడిపోయాయి. అందులో ఆర్మీ ఫ్యామిలీలు కూడా చాలా ఉన్నాయి. ఎంతోమంది సైనికులు భార్యలు  కూడా కోవిడ్ సమయం లో ఉద్యోగాలు కోల్పోయారు అని ఫీడింగ్ అమెరికా గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కు ముందు చాలా మంది సైనికుల భార్యలు  కూడా ఉద్యోగాలు చేసేవారు. రెండు ఆదాయాల తో  జీవనం సాఫీగా సాగేది. కానీ కరోణ టైం లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఇంట్లో పిల్లలకు వేళకు తిండి లేని పరిస్థితి నెలకొందట. అయితే సాధారణ అమెరికా వాసులకు ఈ విషయం తెలియదంటున్నారు ఆర్మీ కుటుంబాలు. కానీ సైన్యం లో చాలామందికి తెలుసు.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంలో తాము సభ్యులమంటున్న ఆర్మీ కుటుంబ సభ్యులు తమకు మాత్రం ఫుడ్ దొరకడం లేదు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడటం పై వారెలా దృష్టి పెట్టగలరని మాజీ సైనికులు అంటున్నారు. కరెంటు బిల్లులు చెల్లించలేక  చీకట్లోనే బతికేందుకు ఆర్మీ కుటుంబాలు అలవాటు పడ్డాయని అంటున్నారు.  మొత్తానికి అమెరికా ఆర్మీ పై ప్రపంచానికి తెలియని మరో కోణం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికైనా తిండి లేక అల్లాడిపోతున్న ఆర్మీ కుటుంబ సభ్యులపై దృష్టి పెట్టాలంటున్నారు ఆ దేశ పౌరులు.

మరింత సమాచారం తెలుసుకోండి: