ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. అందుకే ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు నెల రోజులు గడిచి పోతుంది. అయినా  పరిస్థితుల్లో మాత్రం ఎక్కడ మార్పు రావడం లేదు. రోజు రోజుకి రష్యా సేనలు మరింత దూకుడుగా ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడుతోన్న నేపథ్యం లో ప్రస్తుతం ఉక్రెయిన్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలాంటి సమయంలో అటు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్న జెలెన్ స్కీ ప్రపంచ దేశాలు యుద్ధ విమానాలు సహాయం చేయాలిఅంటూ కోరుతున్నారు.


 తాము తమ సార్వ భౌమాధికారాన్ని రష్య దగ్గర తాకట్టు పెట్టేందుకు సిద్ధం గా లేమని.. ప్రాణాలకు తెగించి పోరాడేందుకు కూడా తమ సైన్యం సిద్ధం గా ఉన్నారంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే మొన్నటి వరకు సాధారణ మిస్సైల్స్  మాత్రమే ప్రయోగించింది రష్యా. అయితే ఇప్పుడు ఏకంగా బాలిస్టిక్ మిసైల్ కూడా ప్రయోగిస్తూ విధ్వంసం సృష్టిస్తుంది అనే విషయం తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో ఇక ఉక్రెయిన్ రష్యా రసాయనిక మిసైల్స్ కూడా ప్రయోగించేందుకు సిద్ధమైంది అంటూ టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన అధ్యక్షుడు జెలెన్ స్కీ రష్యా రసాయన దాడులకు సిద్ధమైందని తమకు సహాయం కావాలంటూ కోరారు.



 ఈ క్రమం  లోనే ఇటీవల నాటో యూరోపియన్ యూనియన్ దేశాలు స్పందించాయి. రష్యా ఉక్రెయిన్ రసాయనిక దాడులకు పాల్పడటం విరమించు కోవాలి అంటూ సూచించాయి. ఇక తమ అభ్యర్థులను తిరస్కరిస్తూ ఒకవేళ రష్యా ఉక్రెయిన్ పై రసాయనిక దాడులకు పాల్పడితే ఇక పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అంటూ నాటో హెచ్చరికలు జారీ చేసింది. రష్యా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరికలు జారీ చేసింది. నాటో హెచ్చరికలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: