ప్రపంచ వినాశనానికి చైనా ప్రయోగించిన బయో వెపన్ అని చెప్పుకునే కరోనా వైరస్ ఇక ఇప్పుడు ఆ చైనా పైనే కన్నెర్రా చేస్తూ విజృంభిస్తోంది. అసలు నిజాలు దాచి ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టేందుకు ప్రయత్నించి చైనాకు ఇక ఇప్పుడు అదే రీతిలో సంక్షోభం ఎదురవుతూ ఉండడం గమనార్హం. ప్రపంచ దేశాలు ఇప్పటికే మూడు దశల కరోనా వైరస్ ను ఎదుర్కొన్నాయి.  ఈ క్రమంలోనే  ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయ్ ప్రపంచ దేశాలు. ఇలాంటి సమయంలోనే చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 చైనాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉండడం ఆందోళన కరంగా మారిపోతుంది. అయితే జీరో టాలరెన్స్ అని చెబుతూ చైనా ప్రభుత్వం తక్కువ కేసులు వెలుగులోకి వచ్చినప్పుడే ఇక్కడ నిబంధనలు విధిస్తూ ఉన్నప్పటికీ అక్కడ కేసుల సంఖ్య మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. ఇలా కరోనా వైరస్ కేసుల సంఖ్య చైనాలో పెరిగిపోతుండడంతో ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాలో ఇటీవలే ఆదివారం ఒక్కరోజే 13146 కొత్త కరోనా కేసులు వెలుగులోకి రావడం గమనార్హం. ఇలా వెలుగులోకి వచ్చిన కొత్త కేసుల్లో శాంగాయ్ నగరంలోనే 70 శాతం కేసులు నమోదయ్యాయి అన్నది తెలుస్తుంది.



 అయితే చైనాలో గత రెండేళ్ల కాలంలో ఇక ఇవే గరిష్ట కేసులు అన్నది అక్కడ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇక అందరికీ ఊరటనిచ్చే అంశం మాత్రం అక్కడ మరణాల సంఖ్య తక్కువగా ఉంది అంటూ నిపుణులు అంటున్నారు. ఓమిక్రాన్  వేరియంట్లో కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చి వాయువేగంతో వ్యాప్తి చెందుతుంది అని నిపుణులు అంచనా వేస్తూ ఉండటం గమనార్హం. రోజురోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం నిషేధిత ఆంక్షలు విధిస్తూ ఎన్నో ప్రాంతాలలో  లాక్ డౌన్ విధిస్తున్న  పరిస్థితి ఏర్పడింది. అన్ని దేశాలు ఆంక్షల నుంచి బయట పడుతున్న సమయంలో కరోనా వైరస్ మాత్రం ఆంక్షల చట్రంలోకి వెళ్ళిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: